తనీష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మరో ప్రస్థానం’.. జానీ దర్శకత్వం వహించారు. తనీష్ జోడీగా ముస్కాన్ సేథీ నటించగా, మరో ముఖ్యమైన పాత్రలో భానుశ్రీ మెహ్రా కనిపించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఆద్యంతం యాక్షన్ ఎమోషన్ హైలైట్ గా నిలవగా తనీష్ సీరియస్ ఇంటెన్స్ రోల్ ఆకట్టుకుంది. ‘అనాథనైన నాకు జీవితం యుద్ధంలానే అనిపించేది. ప్రపంచం యుద్దభూమిలా కనిపించేది’ అంటూ తనీశ్ తన పాత్రని వివరించిన తీరు బాగుంది.…