ఓ సారి ఓ మెజీషియన్ జనం ఏది కావాలంటే అది తీసి ఇస్తున్నాడు. చివరకు స్టేజీపైకి ఏనుగు కావాలని కోరగానే, దానినీ తీసుకువచ్చాడు. ఇదంతా చూసిన ఓ అబ్బాయి వెళ్ళి ‘నన్ను తెలుగు సినిమా రంగంలో టాప్ హీరోని చెయ్’ అని అడిగాడు. మెజీషియన్ చప్పున మాయమై పోయాడు. మళ్ళీ జనానికి కనిపించలేదు. ఈ కథ వింటే ఏమనిపిస్తోంది? ఎక్కడైనా హీరోగా రాణించవచ్చునేమో కానీ, ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో అది అంత సులువు కాదు అని…