భద్రాచలంలో రాములోరి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిపేందుకు ఆలయ అధికారులు, అర్చకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ సీతారామ కళ్యాణం కొద్ది సేపట్లో ప్రారంభం కానున్నది. రెండేళ్ల తరువాత కరోనా అనంతరం జరుగుతున్న కల్యాణ మహోత్సవం చూసేందుకు భక్తులు తరలి వస్తున్నారు. మిథిలా స్టేడియంను ఇప్పటికే పోలీస్ యంత్రాంగం తన చేతుల్లోకి తీసుకుంది.. ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి పోలీసులను రప్పించారు. దేవాదాయశాఖ మంత్రి…