అధికార వైసీపీ భీమవరంలో ప్రత్యేక పొలిటికల్ ఆపరేషన్ మొదలుపెట్టిందా? కుల సమీకరణాల ద్వారా పూర్తిస్థాయిలో పాగా వేయబోతుందా? ఎవరు ఎవరితో కలిసినా భీమవరాన్ని శత్రుదుర్బేధ్యం చేయాలని చూస్తోందా? వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే పక్కాగా పావులు కదుపుతోందా? ఇంతకీ ఏంటా ఎత్తుగడలు? సైలెంట్‌గా భీమవరంలో వైసీపీ పొలిటికల్ ఆపరేషన్..! ఆపరేషన్ కుప్పం ద్వారా అధికార వైసీపీ చంద్రబాబు ఇలాకాలో ఏ విధంగా పాగా వేసిందో చూశాం. చంద్రబాబు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నారే తప్ప.. అక్కడ పంచాయతీ, పరిషత్,…