సంక్రాంతి కానుకగా జనవరి 14న ఐదు భాషల్లో విడుదల కాబోతోంది రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’. విశేషం ఏమంటే… ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్, టీ సీరిస్ సంస్థ… ఏ భాష ప్రమోషన్స్ ఆ భాషలో విడివిడిగా చేస్తూ, అది అదే భాషలో తెరకెక్కిన స్ట్రయిట్ సినిమా అనే భావన కలగచేస్తున్నాయి. సహజంగా పాన్ ఇండియా మూవీస్ కు సంబంధించిన ప్రమోషన్స్ ను ఒకేసారి అన్ని భాషల్లో చేయడం…