మధ్యప్రదేశ్ లో శివపురి జిల్లాలో ఆరేళ్ల బాలికపై దారుణంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి కరేరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బడోరా గ్రామంలో చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాలిక తల్లి గుడిలో జరుగుతున్న ఓ కార్యక్రమానికి తీసుకెళ్లింది. అయితే ఆ సమయంలో బాలిక, తల్లి నుంచి విడిపోయింది. బాలిక ఇంటికి వెళ్లి ఉంటుందని తల్లి భావించింది.