తెలంగాణ మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగులో ఆమె ప్రారంభించిన శిలాఫలకాల ధ్వంసం చర్చనీయాంశం అవుతోంది. మొన్న కొండాయి గ్రామంలో, నిన్న అబ్బాయిగూడెంలో వరుసగా సీతక్క ఆవిష్కరించిన శిలాఫలకాలనే ధ్వసం చేశారు గుర్తు తెలియని దుండగులు. గిరిజనుల అవసరాలకు కోసం చేపడుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను పగలగొడుతున్నది స్వపక్ష నేతలా విపక్ష నాయకులా అన్నది హాట్ టాపిక్ అయ్యింది వరంగల్ పొలిటికల్ సర్కిల్స్‌లో.