ఉత్తరాఖండ్‌లో బీజేపీ ప్రభుత్వానికి పెద్ద షాక్ తగిలింది. ఉత్తరాఖండ్ రవాణా శాఖ మంత్రి యశ్‌పాల్ ఆర్య, ఆయన కుమారుడు సంజీవ్ ఆర్యాతో కలిసి ఈరోజు కాంగ్రెస్‌లో చేరారు. మరికొన్ని నెలల్లో ఉత్తరాఖండ్‌కు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో మంత్రి బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరడంతో అక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సంజీవ్ ఆర్య ప్రస్తుతం నైనిటాల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కాగా, యశ్‌పాల్ ఆర్య, సంజీవ్ ఆర్యాలు బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, తమ పదవులకు రాజీనామా…