తాగునీటి సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికా బద్దంగా చర్యలు తీసుకుంటున్నట్లు పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా తాండూరు సమీపంలోని కాగ్నా నది నుండి త్రాగు నీరు అందించే పంప్ హౌస్ ను జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, మిషన్ భగీరథ ఉన్నతాధికారులతో కలిసి ప్రిన్సిపల్ సెక్రటరీ పరిశీలించారు. ఈ సందర్భంగా పత్రికా…