ఇటీవల రాజస్థాన్ లోని అల్వార్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో సందీప్ దయామా మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ ఎన్ని మసీదులు, గురుద్వారాలు నిర్మించారో చూడండి, ఇది భవిష్యత్తులో మనకు పుండుగా మారుతుంది.. అందుకే ఈ పుండును నిర్మూలించడం మా కర్తవ్యం’’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు.