2014 నుంచి కునారిల్లుతున్న ఏపీ కాంగ్రెస్‌పై అధిష్టానం ఫోకస్ పెట్టిందా? త్వరలో సారథి మారనున్నారా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి తీసికట్టు నాగంబొట్టు తరహాగా మారింది. అటు అసెంబ్లీ, ఇటు లోక్ సభలోనూ జాతీయ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. తీరా స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా హస్తవాసి బాగుంటుందా అంటే అలాంటిదేం లేదు. ఏయేటికాయేడు పార్టీ పరిస్థితి దిగజారిపోతోంది. అసలు పార్టీ వుందా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం…
పెట్రోల్ , గ్యాస్ ధరలు అదుపులేకుండా పెరుగుతున్నాయి. కరోనా కష్టకాలంలో ప్రజలను దోపిడీ చేస్తున్నారు అని శైలజానాథ్ అన్నారు. 14 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు పెట్రోల్ పేరిట దోచుకున్నారు. దీనిపై సీఎం జగన్ ఎందుకు మాట్లాడరు. ఒక్క స్టేట్ టాక్స్ 40 రూపాయలు ఉంది, కేంద్రం 30 రూపాయలు టాక్స్ వేస్తోంది. నేపాల్, శ్రీలంక లో తక్కువ ధరలు ఉన్నాయి, మన రాష్ట్రంలో ఎందుకు ఎక్కువ అని ప్రశ్నించారు. మీ ఆర్థిక మిత్రులకు దోచి పెట్టడానికి…
ప్రజలు కష్టాల్లో వుంటే కరోనా కట్టడి పేరుతో ప్రజావ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు అని ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ అన్నారు. అశాస్త్రీయ పద్దతిలో వేక్సినేషన్లు వేస్తున్నారు అని తెలిపారు. చెత్తకు పన్నులు వేస్తారా… 15 శాతానికి మించి ఆస్తిపన్ను పెంచామంటే ప్రజలకు ఏమి అర్ధమవుతుంది. పన్నులు పెంచుతోంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు నోటికి ప్లాస్టర్లు వేసుకుని వున్నారా అని ప్రశ్నించారు. ప్రతి ఇంటికి వెళ్లిప్రజల నుంచి చెత్తను కొనుక్కోండి.. వాటిని అమ్ముకోండి.. ప్రజలపై భారాలు వేయకండి అన్నారు. పన్నుల…
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు ఏపీసిసి అధ్యక్షుడు సాకే శైలజానాథ్, ఆ పార్టి నేతలు. ప్రజలకు ఉచితంగా వ్యాక్సినేషన్ వేయాలని, కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యం చెందిందని గవర్నర్ కు వినతి పత్రం అందచేసిన సాకే శైలజానాథ్ అనంతరం మాట్లాడుతూ… దేశంలో ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలి. మాటలు చెప్పకుండా ఏకీక్రుత విధానంలో వ్యాక్సినేషన్ ఇవ్వాలి. భారత్ బయోటెక్ మంచి నీటి బాటిల్ కన్నా తక్కువ ధరకు వ్యాక్సిన్ ఇస్తామన్నారు. కానీ ధరలు పెంచి విపరీతంగా దండుకుంటున్నారు.…