బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్ అలీ ఖాన్ బిలియనీర్ల వివాహ వేడుకలపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకపై తాను ధనవంతుల పెళ్లిళ్లలో డ్యాన్స్ చేయనని, ఈ ట్రెండ్‌ను ప్రోత్సహించడం తనకు ఇష్టం లేదని ఆయన స్పష్టం చేశారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలు ఇప్పటికీ ఇలాంటి వేడుకల్లో ప్రదర్శనలు ఇస్తున్నప్పటికీ, తాను మాత్రం ఆ బాటలో నడవాలని అనుకోవడం లేదని వెల్లడించారు. కెరీర్ ప్రారంభంలో సరదాగా ఇలాంటి వాటిలో పాల్గొన్నప్పటికీ, ఇప్పుడు…