పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో గల స్వర్ణ దేవాలయాన్ని టార్గెట్గా చేసుకుని డ్రోన్లు, మిస్సైల్స్ తో దాడికి ప్రయత్నించింది అని GOC మేజర్ జనరల్ కార్తీక్ సి శేషాద్రి ఈ రోజు మీడియాకు తెలిపారు. ఇక, గోల్డెన్ టెంపుల్ ని లక్ష్యంగా చేసుకున్న అన్ని డ్రోన్‌లు, క్షిపణులను ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు వెల్లడించారు.
India Pakistan War: ఆపరేషన్ సింధూర్ తర్వాత కాల్పులు జరిపిన పాకిస్తాన్ భారతదేశానికి వ్యతిరేకంగా అణ్వాయుధ సామర్థ్యం గల షాహీన్ క్షిపణిని ఉపయోగించినట్లు ఇండియన్ ఆర్మీ ధృవీకరించింది. అయితే, ఈ క్షిపణినీ భారతదేశం తన S-400 రక్షణ వ్యవస్థతో అడ్డుకుంది.