హర్యానాలో మంగళవారం ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం ఈ కేసును అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రోహ్‌తక్ ఎస్పీ నరేంద్ర బిజార్ణియాపై అధికారులు వేటు వేశారు.