RGV-Show Man: సంచలనాలకు ప్రతీకగా నిలిచిన రామ్ గోపాల్ వర్మ మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకున్నాడు. ఎన్నో ప్రయోగాలు, వివాదాలు, విభిన్నమైన కథాంశాలతో దర్శకుడిగా వందలాది మంది అభిమానం సంపాదించిన ఆర్జీవీ ఇప్పుడు కెమెరా ఎదుట ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. తానే హీరోగా వస్తుండటమే కాదు, ఈ ప్రయత్నాన్ని సాధారణ సినిమా ప్రయోగంలా కాకుండా తన వ్యక్తిత్వాన్నే ప్రతిబింబించేలా “షో మ్యాన్” అనే టైటిల్‌తో మలచుకుంటున్నాడు. ఈ చిత్రానికి “మ్యాడ్ మాన్‌స్టర్” అనే విభిన్న ట్యాగ్‌లైన్…