సోమవారం సాయంత్రం ఢిల్లీలోని చాందినీ చౌక్ వద్ద భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోటకు ఎదురుగా జరిగిన కారు పేలుడు యావత్ దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. ఎర్రకోట పేలుడు ఆత్మాహుతి దాడి అని భద్రతా సంస్థలు అంటున్నాయి. కారు బ్లాస్ట్‌కు ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌తో సంబంధం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. పేలుడు ఘటనకు డాక్టర్ ఉమర్ మహ్మద్ సూత్రధారి అని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఉమర్ తన సహచరులతో కలిసి మాస్టర్ ప్లాన్ చేసినట్లు తెలిపాయి. దాడికి కారణమైన…
ఢిల్లీలోని ఎర్రకోట కారు పేలుడు ఘటనపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. పేలుడు ఘటనపై భద్రతా, దర్యాప్తు సంస్థలు సమగ్ర విచారణ చేస్తున్నాయని, నిందితులను కఠినంగా శిక్షిస్తాం అని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. ఈ చర్యను శాంతికి భంగం కలిగించే పిరికి ప్రయత్నంగా పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో రక్షణ శాఖ మంత్రి మాట్లాడారు. ‘ఎర్రకోట కారు పేలుడు ఘటనపై దేశంలోని…
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం జరిగిన కారు పేలుడు ఘటనకు డాక్టర్ ఉమర్ మహ్మదే ప్రధాన సూత్రధారి అని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఉమర్ తన ఇద్దరు సహచరులతో కలిసి ప్లాన్ చేసినట్లు తెలిపాయి. పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్‌ను ఉమర్ వాడాడు. పేలుడు ఘటనలో డిటోనేటర్లను వినియోగించినట్లు అధికారులు చెప్పారు. ఢిల్లీలో పేలుడు ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పేలుడుకు కారణమైన ఐ20 కారు కదలికలపై దర్యాప్తు సంస్థలు కీలక…