ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరుగుతున్నాయి. పాతబస్తీ బహదూర్ పుర లోని ప్రధాన మీరాలం ఈద్గాలో ఉదయం 9గంటలకు సామూహిక ఈదుల్ ఫితర్ ప్రత్యేక రంజాన్ ప్రార్థనలు జరగనున్నాయి. ప్రార్ధనలో వేల సంఖ్యలో పాల్గొననున్నారు ముస్లింలు. జీహెచ్ఎంసీ, మెడికల్, మెట్రో వాటర్ వర్క్స్, రెవిన్యూ, శానిటేషన్, అగ్నిమాపక శాఖల అధికారులతో తగిన ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. మీరాలం ఈద్గా లో 500 మంది పోలీసులతో కట్టు దిటమైన భద్రత ఏర్పాటుచేశారు. ఈద్గా…
సోమవారం సాయంత్రం నెలవంక కనిపించిన సందర్భంగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిములకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్-ఉల్-ఫితర్ పర్వదిన వేడుకల్ని సంతోషంగా జరుపుకొని, పవిత్ర ప్రార్థనలతో ఆ అల్లాహ్ దీవెనలు పొందాలని ఆకాంక్షించారు. ఈ పవిత్ర పండుగ మానవ సేవే చేయాలన్న మంచి సందేశాన్ని మానవాళికి ఇస్తుందని.. ఈ మాసంలో ఆచరించే ఉపవాసం, దైవ ప్రార్థనాలు క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని, ఆధ్యాత్మికతను పెంపొందిస్తాయని అన్నారు. Read Also: Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ బీహార్ ప్రయోగం వెనక…
ముస్లింలకు పరమ పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభం అయింది. శనివారం సాయంత్రం నెలవంక కనిపించడంతో ముస్లింలలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. మసీదుల్లో సైరన్లు మోగాయి. రంజాన్ మాసం నేపథ్యంలో ఇప్పటికే మసీదులను అందంగా ముస్తాబు చేశారు. నెలవంక దర్శనమిచ్చిన నేపథ్యంలో ఇవాళ్టి నుంచి నమాజులు చేపట్టనున్నారు. రంజాన్ ఉపవాస దీక్షలు ఆదివారం నుంచి ప్రారంభం అయ్యాయి. రంజాన్ నేపథ్యంలో, ముస్లింలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు,…