Rajendra Kumar Jayanthi Special : హిందీ చిత్రసీమ స్వర్ణయుగం చవిచూసిన రోజుల్లో దిలీప్ కుమార్, రాజ్ కపూర్, దేవానంద్ టాప్ స్టార్స్ గా వెలుగొందారు. వారి కాలంలోనే వరుస రజతోత్సవాలతో ‘జూబిలీ కుమార్’ అని పిలిపించుకున్న ఘనుడు రాజేంద్రకుమార్. అనేక విజయవంతమైన చిత్రాలలో హీరోగా, కేరెక్టర్ యాక్టర్ గా, కీ ప్లేయర్ గా నటించి మెప్పించారు రాజేంద్రకుమార్. రాజేంద్రకుమార్ తులీ 1927 జూలై 20న పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు. కరాచీలో వీరి కుటుంబం వ్యాపారం…