తెలంగాణలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పర్యటన ఖరారైన విషయం తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ మే 4, 5 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. మే 4న వరంగల్ జిల్లాలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. 5వ తేదీన బోయిన్‌పల్లిలో కార్యకర్తలతో సమావేశమవుతారు. దీంతో రాహుల్ పర్యటనను విజయవంతం చేసేందుకు టీపీసీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రచార కమిటీ చైర్మన్ మదు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ…