ఢిల్లీకి చెందిన నటుడు, యూ ట్యూబర్ రాహుల్ వోరా (35) కరోనా సెకండ్ వేవ్ కోరల్లో చిక్కి ఆదివారం కన్నుమూశాడు. గత కొంతకాలంగా రాహుల్ కరోనాతో పోరాడుతున్నాడు. అతన్ని మొన్న రాజీవ్ గాంధీ హాస్పిటల్ నుండి ద్వారకాలోని ఆశ్రమ్ హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు. దానికి రెండు రోజుల ముందే తనకు ఆక్సిజన్ బెడ్ దొరకడం లేదని, ఏం చేయాలో పాలు పోవడం లేదని రాహుల్ వోరా ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు. మరీ బాధాకరం…