రిసార్ట్ రిసెప్షనిస్ట్ అంకితా భండారీ హత్య కేసులో ప్రధాన నిందితుడు, బహిష్కరణకు గురైన బీజేపీ నేత కుమారుడు పుల్కిత్ ఆర్యకు నిర్వహించిన నార్కో, పాలీగ్రాఫ్ పరీక్షలకు ఉత్తరాఖండ్‌లోని కోటద్వార్ ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు బుధవారం ఆమోదం తెలిపింది.
ఉత్తరాఖండ్‌లో 19 ఏళ్ల రిసెప్షనిస్ట్ హత్య కేసులో ఇంకా చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. నిందితుడు పుల్కిత్ ఆర్య బాధితురాలి స్నేహితుడిని కూాడా తప్పు దోవ పట్టించడానికి ప్రయత్నించాడు.