YSRCP : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలపై అదనపు భారాన్ని మోపుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. విద్యుత్ ఛార్జీల పెంపుతో సామాన్యులపై భారాన్ని పెంచిన ప్రభుత్వ నిర్ణయం దారుణమని ఆ పార్టీ నేతలు విమర్శించారు. విద్యుత్ ఛార్జీల పెంపు కారణంగా ప్రజలపై రూ. 15,000 కోట్ల అదనపు భారం పడిందని వైసీపీ ఆరోపించింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రాష్ట్ర…