బీహారీయులు కొత్త ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ తెలిపారు. బీహార్‌లో తొలి విడతలో భారీగా పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం రెండో విడత ఎన్నికల కోసం ఉధృతంగా ప్రచారం సాగుతోంది. ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడారు.
బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. నెలల తరబడి తాను చెబుతున్నదే నిజమైందని జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ అన్నారు. గురువారం తొలి విడత పోలింగ్ ముగిసింది. మొత్తం 64.66 శాతం పోలింగ్ నమోదైనట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది.