Kethireddy Venkatarami Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కోడిని కోసినా కేసులు పెట్టే పరిస్థితి నెలకొందని, ఈ విధమైన పాలనతో కూటమికి వినాశనం తప్పదని ఆయన హెచ్చరించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లు గడిచినా రాష్ట్ర పరిస్థితి మారలేదని అన్నారు. ప్రభుత్వం ప్రజలను ఇంకా మభ్యపెట్టే ప్రయత్నమే చేస్తోందని ఆరోపించారు. రాయలసీమతో పాటు వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి కోసం ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదని…