మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకే మాల్ ఇప్పిస్తామన్నారు. కొన్ని వస్తువులు అయితే మార్కెట్ రేటు కంటే నలభైశాతం తక్కువకే ఇస్తామని మాయమాటలు చెప్పారు. అందరినీ నమ్మించేందుకు రెండు మూడు నెలలు చెప్పినట్లే చేసి తర్వాత కోట్ల రూపాయలు వసూలు చేశారు. డబ్బులు ఇవ్వమంటే అడ్డం తిరగడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. గుంటూరు ఏటీ అగ్రహారానికి చెందిన పడుచూరి రమ్య, దిలీప్ లు గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో మోసాలకు తెరతీశారు. తెలిసిన…