విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న నందమూరి తారకరామారావు అంటేనే ఓ సంచలనం! ఆయన ఓ ట్రెండ్ సెట్టర్. అటు రాజకీయాల్లో కానీ, ఇటు సినిమారంగంలో కానీ నందమూరి బాటనే పలువురు అనుసరించారు. అనుసరిస్తున్నారు. భవిష్యత్ లోనూ అనుసరించబోతారు. ఇందులో ఏలాంటి సందేహమూ లేదు. చిత్రసీమలోనూ, రాజకీయ రంగంలోనూ యన్టీఆర్ సాధించిన అరుదైన విజయాలను తలచుకుంటేనే మది పులకించిపోతూఉంటుంది. అదే పనిగా చరిత్ర సృష్టించాలని యన్టీఆర్ ఏ నాడూ ఏ పనీ చేయలేదు. ఆయన పూనుకున్న కార్యం విజయవంతమయ్యాకే ఓ…