ఏఐ (AI) కెమెరాలతో భారత సరిహద్దులో నిఘా..చొరబాటుదారుల కట్టడికి యత్నం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో కూడిన కెమెరాలతో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రత్యేక కెమెరాలను సరిహద్దు భద్రతా దళం (BSF) భద్రతను పెంచడానికి, చొరబాటుదారులను నిరోధించడానికి వినియోగిస్తోంది. కెమెరాలు, ఫేషియల్ రికగ్నిషన్ పరికరాలతోపాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సరిహద్దుల్లో నిఘా పెంచామని బీఎస్ఎఫ్ అధికారులు చెబుతున్నారు. ఇది చొరబాట్లు, నేరాలు, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధిస్తుంది. సరిహద్దు పోస్టుల వద్ద బలగాల సంఖ్యను పెంచామని,…