కన్నడ ప్రముఖ నటుడు దర్శన్, ప్రస్తుతం రేణుకాస్వామి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ పరప్పన అగ్రహార జైల్లో విచారణ ఖైదీగా ఉన్నారు. అయితే, జైలులో ఆయనకు నరకం చూపిస్తున్నారని, ఉగ్రవాదులను ఉంచే హై-సెక్యూరిటీ సెల్‌లో ఒంటరిగా బంధించారని ఆయన తరపు న్యాయవాది కోర్టులో తీవ్ర వాదనలు వినిపించారు. హత్య కేసులో అరెస్టయిన దర్శన్‌ను జైలు అధికారులు అత్యంత కఠినంగా చూస్తున్నారని ఆయన లాయర్ సివిల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇతర ఖైదీలతో కలవకుండా, మానసికంగా వేధించే ఉద్దేశంతో…