పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్ కు బుద్ధి చెప్పాలిన ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ నాయకులు నిరంతరం ఒళ్లు బలుపు మాటలు, బెదిరింపు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ అణ్వాయుధ శక్తిని కలిగి ఉన్నందున…