ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తొలిగిపోవడంతో ఓరుగల్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుందా? ఎన్నికల కోడ్‌కి.. ఎమ్మెల్యేలకు లింకేంటి? కోడ్ అమలులో ఉన్నప్పుడు వారికి కలిసొచ్చిందేంటి? ఇప్పుడు వారిని ఇబ్బంది పెడుతున్న అంశం ఏంటి? రైతులకు ఎలా సర్దిచెప్పాలో తెలియక ఎమ్మెల్యేల ఆందోళన..! ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని ఏకగ్రీవంగా గెలిపించుకునేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా వ్యూహాలే రచించారు. చివరకు వారు అనుకున్నదే అయింది. అధిష్ఠానం దగ్గర మార్కులు వేయించుకున్నారు. ఇంత…