పహల్గామ్‌లో హిందువుల ఊచకోతకు పాకిస్థాన్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్ నుంచి పీఓకే వరకు లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన 9 రహస్య స్థావరాలను భారత సైన్యం పూర్తిగా ధ్వంసం చేసింది. పాకిస్థాన్‌పై జరిగిన ఈ దాడికి భారత సైన్యం "ఆపరేషన్ సిందూర్" అని పేరు పెట్టింది. ఈ దాడి తర్వాత.. మొత్తం పాకిస్థాన్‌లో భయానక వాతావరణం నెలకొంది.
Ponnam Prabhakar: నేడు ఉదయం పాకిస్తాన్ పై భారత్ చేసిన ‘ఆపరేషన్ సింధూరం’ విజయం కావడంతో దేశమంతటా విజయోత్సవ సంబరాలు కొనసాగుతున్నాయి. ఇక ఈ “ఆపరేషన్ సింధూర్” విజయవంతంపై హుస్నాబాద్ నియోజకవర్గం కొహెడలో మంత్రి పొన్నం ప్రభాకర్ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన హర్షం వ్యక్తం చేసారు. భారత్ మాత కి జై అంటూ నినాదాలు చేస్తూ సంబరాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన వ్యాఖ్యానిస్తూ.. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్…
కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం "ఆపరేషన్ సిందూర్" నిర్వహించింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని, భారత వైమానిక దళం, భారత సైన్యం, నావికాదళం సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ దాడిలో క్షిపణులు ప్రయోగించారు. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు.