హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని టీఎస్ పార్డ్‌లో 33 జిల్లాల వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, ఉద్యోగులతో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి నెలా ఒకరోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. సీఎం కేసీఆర్.. దేశంలో తొలిస్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. 100శాతం వ్యాక్సినేషన్ దిశగా కృషి చేయాలని అధికారులను అదేశించారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో…