Off The Record: కొలుసు పార్ధసారధి.. ఏపీ క్యాబినెట్ మినిస్టర్ అండ్ కృష్ణాజిల్లా నూజివీడు ఎమ్మెల్యే. గతంలో పెనమలూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సారధి.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో తొలిసారి మంత్రి అయ్యారు. 2014లో వైసీపీ తరపున మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసి ఓడిపోగా….అదే పార్టీ నుంచి 2019లో పెనమలూరు ఎమ్మెల్యే అయ్యారాయన. అప్పుడే మంత్రి పదవి మీద చాలా ఆశలు పెట్టుకున్నా….చివరికి అది జోగి రమేష్‌ను వరించింది. ఇక అప్పటి నుంచి అసంతృప్తి మొదలవడంతో…