విశ్వవిఖ్యాత నవరస నటనా సార్వభౌమ నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి నేడు. యావత్ తెలుగు ప్రజల చేత అన్నగారు అని పిలిపించుకున్న ఎన్టీఆర్ 1996 జనవరి 18న మరణించారు. తెలుగు జాతి గర్వంగా, తెలుగు జాతి ప్రతీకగా నిలిచిన అన్నగారి వర్ధంతి సంధర్భంగా నందమూరి అభిమానులు, కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి నివాళులు అర్పిస్తున్నారు. తాతకి నివాళులు అర్పించడానికి కళ్యాణ్ రామ్ ఈ తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాట్ కి చెరుకుని ఎన్టీఆర్ సమాధికి పూలమాలలు…