బాలీవుడ్ సెన్సేషనల్ డ్యాన్సర్, నటి నోరా ఫతేహి పెను ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడ్డారు. ముంబైలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రయాణిస్తున్న కారు తీవ్రంగా దెబ్బతింది. ముంబైలో జరుగుతున్న ప్రముఖ అమెరికన్ డీజే డేవిడ్ గెట్టా ‘సన్‌బర్న్’ సంగీత కచేరీకి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఒక డ్రైవర్ వేగంగా వచ్చి నోరా కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఆమె సిబ్బంది అప్రమత్తమై సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.…