Hottest Year On Climate : 2024 వాతావరణ రికార్డులో అత్యంత వేడి సంవత్సరంగా అంచనా వేయబడింది. సముద్రం కూడా సురక్షితం కాదు. వాతావరణ రికార్డులో 2024 అత్యంత వేడిగా ఉండే సంవత్సరంగా 55శాతం అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు.
భూ చరత్రలో, మానవజాతి మొదలైనప్పటి నుంచి చరిత్రలో కనీవిని ఎరగనంతగా భూమిపై కార్బన్ డయాక్సైడ్ పెరుగుతోంది. తాజాగా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఓఏఏ) ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం.. ఈ ఏడాది మేలో భూగ్రహంపై సీఓ2 వాయువు రికార్డ్ స్థాయికి చేరుకుందని వెల్లడించింది. పారిశ్రామిక విప్లవానికి ముందున్న కార్బన్ డయాక్సైడ్ తో పోలిస్తే 50 శాతం అధికంగా వాతావరణంలోకి సీఓ2 విడుదల అవుతోంది. జూన్ 3న హవాయ్ లోని మౌనాలోవా అగ్నిపర్వతంపై ఉన్న…