టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు బహిరంగ లేఖ రాశారు. నిమ్స్ లో కాంట్రాక్టు స్టాఫ్ నర్సు ల సమస్యలు పరిష్కరించాలని లేఖలో ఆయన డిమాండ్ చేశారు. 423 మంది స్టాఫ్ నర్సులు పది రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు.. ఇది దుర్మార్గమని ఆయన తెలంగాణ ప్రభుత్వంపై అగ్రహం వ్యక్తం చేశారు. ప్రసూతి సెలవులు నుంచి జీతాల పే స్లిప్ ల వరకు…