బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ కొత్త సినిమా ‘నీయత్’ షూటింగ్ మంగళవారం యూకేలో మొదలైంది. విద్యాబాలన్ టైటిల్ రోల్ ప్లే చేసిన ‘శకుంతలదేవి’ చిత్రాన్ని తెరకెక్కించిన అనూ మీనన్ ‘నీయత్’ సినిమాను డైరెక్ట్ చేస్తోంది. అమెజాన్ ప్రైమ్, అబాండెంటియా ఎంటర్ టైన్ మెంట్, విద్యాబాలన్ కాంబోలో వస్తున్న నాలుగో చిత్రమిది. గతంలో ఈ ముగ్గురి కలయికలో ‘శకుంతల దేవి, షేర్నీ, జల్సా’ చిత్రాలు వచ్చాయి. లేటెస్ట్ మూవీ ‘నీయత్’లో విద్యాబాలన్ డిటెక్టివ్ మీరా రావ్ పాత్రను పోషిస్తోంది.…