ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ నగరానికి అరుదైన ఘనత దక్కింది. దేశంలోనే మహిళలకు రక్షణ కల్పించడంలో ముంబై, భువనేశ్వర్ నగరాలతో పాటు విశాఖ మొదటి స్థానంలో నిలిచింది. కోహిమా, ఆయిజోల్, గాంగ్‌టోక్, ఇటానగర్ కూడా టాప్‌లో నిలిచాయి. ఢిల్లీ, పట్నా, రాంచీ, జైపుర్, ఫరీదాబాద్, కోల్‌కతా, శ్రీనగర్‌లు జాబితాలో దిగువన ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 31 నగరాల్లో 12,770 మంది మహిళలపై నిర్వహించిన ఓ సర్వే ఆధారంగా ఈ జాబితా వెల్లడైంది. NARI 2025 నిర్వహించిన సర్వేలో స్మార్ట్…