ఒక్కసారి కూడా తెరపై తళుక్కుమనలేదు. అయినా నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞకు అభిమానుల్లో తరిగిపోని చెరిగిపోని అభిమానం నెలకొంది. మోక్షజ్ఞ జన్మించిన 1994 సెప్టెంబర్ 6 మొదలు ఇప్పటి దాకా ఆయన ప్రతి పుట్టినరోజును అభిమానులు వేడుకగా జరుపుకుంటూనే ఉన్నారు. అదుగో ఇప్పుడు వస్తాడు… ఇదుగో వచ్చేస్తున్నాడు… అంటూ చాలా ఏళ్ళుగా మోక్షజ్ఞ తెరంగేట్రం గురించిన విశేషాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయినా ఇప్పటి దాకా మోక్షజ్ఞ ఒక్క సినిమాలోనూ నటించింది లేదు. ఏమైతేనేమి బాలకృష్ణ అభిమానులు మాత్రం…