Hyderabad: రంగారెడ్డి జిల్లా మొకిల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాగూడ సమీపంలో ఎకో స్పోర్ట్స్ కారు అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువతికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కోకాపేట్‌లో బర్త్‌డే పార్టీ ముగించుకుని, ఒక స్నేహితుడిని డ్రాప్ చేసి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైనవారు…