ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం భారత స్వాతంత్ర్య పోరాటంలో మహిళల పాత్రను గుర్తుచేసుకున్నారు. దేశం కోసం అనేక మంది మహిళలు త్యాగాలు చేశారని వారి త్యాగం మరువలేనిదని మోడీ కొనియాడారు. “ప్రపంచం ప్రతికూల అంధకారంలో మునిగిపోయినప్పుడు, స్త్రీల గురించి ఆలోచిస్తూ భారతదేశం మాతృమూర్తిని దేవత రూపంలో ఆరాధించేది. సమాజానికి విజ్ఞానాన్ని అందించే గార్గి, మైత్రేయి, అనుసూయ, అరుంధతి మరియు మదాల్సా వంటి పండితులు మనకు ఉన్నారు” అని ఈరోజు…