అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు అసెంబ్లీ నియోజవర్గంలో జరక్కూడనిదేదో జరిగిపోతోందని సొంత పార్టీ జనసేన కేడరే గుర్రుగా ఉందట, గుసగుసలాడుకుంటోందట. నాడు నెత్తిన పెట్టుకుని గెలిపించుకున్న ఎమ్మెల్యే దేవ ప్రసాదరావుకు ఇప్పుడు అంత కానివాళ్ళం అయిపోయామా అంటూ... కార్యకర్తలు నిష్టూరాలాడుతున్నట్టు సమాచారం.