విశాఖ సెంట్రల్ జైలును ఏపీ హోమంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. గంజాయి కేసులో జైలులో ఉన్న గంజాయి ఖైదీలను కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సెంట్రల్ జైల్లో సిబ్బందికి కనీస వసతలు లేవు.. చిన్న, చిన్న పిల్లలు గంజాయి కేసుల్లో ఖైదీలగా ఉన్నారు.
గంజాయి వ్యాపారులు, వినియోగదారులకు ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాస్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు సేఫ్ గేమ్ మానేయాలని, ఓన్లీ స్ట్రయిట్ గేమ్స్ వుండాలని మంత్రి సూచించారు. మూడు నెలలు టైం ఇస్తున్నామని, పోలీసులు మారకపోతే మేం మార్పు చూపిస్తామని హెచ్చరించారు.