ఉత్తర ప్రదేశ్ మధురలోని గోవింద్ నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో తను ప్రేమించిన అమ్మాయి దక్కకపోవడంతో మనస్తాపం చెందిన ఒక ఫోటోగ్రాఫర్ తన దుకాణంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన సూసైడ్ నోట్‌లో తన మరణానికి అమ్మాయి కుటుంబమే కారణమని పేర్కొన్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే…రాజస్థాన్‌లోని డీగ్ జిల్లా లాలా వాలి గలి మెయిన్ బజార్‌లో నివసిస్తున్న ధర్మేంద్ర, తన మేనల్లుడు ఉదిత్ (25) శ్రీ కృష్ణ జన్మస్థాన్ సమీపంలోని పోట్రా కుండ్ దగ్గరలో VK…