ప్రముఖ స్క్రీన్ రైటర్, నటుడు మాడంపు కుంజుకుట్టన్ మే 11న మంగళవారం కరోనాతో కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. స్క్రీన్ రైటర్, దర్శకుడు డెన్నిస్ జోసెఫ్ అకాల మరణం నుండి మలయాళ చిత్ర పరిశ్రమ ఇంకా కోలుకోలేనే లేదు. మే 10న దర్శకుడు డెన్నిస్ జోసెఫ్ మరణించారు. అంతలోనే జాతీయ అవార్డు గెలుచుకున్న స్క్రీన్ రైటర్ మాడంపు కుంజుకుట్టన్ ను కరోనా బలి తీసుకోవడంతో మలయాళ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. మాడంపుకు తీవ్రమైన జ్వరం…