Dhurandhar: స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘‘ధురంధర్’’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ సినిమా వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. ధురంధర్-2 ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లను వసూలు చేసింది. వారంలోనే ఈ ఫీట్ సాధించింది. ధురంధర్ దెబ్బకు బాలీవుడ్, ఇండియా సినిమా రికార్డులు బద్ధలవుతున్నాయి. పాకిస్తాన్ కరాచీలో అండర్ వరల్డ్ మాఫియా, ఉగ్రవాద లింకులు, పాక్ రాజకీయాలే బ్యాక్‌డ్రాప్‌గా నిర్మించిన ఈ సినిమా భారీ సక్సెస్ అందుకుంది.