Cruise Missile: భారత అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ పరీక్షని విజయవంతంగా నిర్వహించారు. క్షిపణిలోని అన్ని వ్యవస్థలు ఆశించిన రీతిలో పనిచేశాయని, ప్రాథమిక లక్ష్యాలను చేరుకున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.