జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివాహ బృందం ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 25 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్ జిల్లా నుండి మహువాదర్‌కు వెళ్తున్న బస్సు మహువాదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓర్సా లోయ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారని, సహాయక చర్యలు ప్రారంభించామని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని జార్ఖండ్ పోలీసులు తెలిపారు.…