Drones Attack: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను లక్ష్యంగా చేసుకుని రష్యా డ్రోన్లతో దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు మరణించారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో 29 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. ఇక మరణించిన వారిలో 19 ఏళ్ల మహిళ, ఆమె 46 ఏళ్ల తల్లి ఉన్నారని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ఇహోర్ క్లైమెంకో తెలిపారు. రష్యా డ్రోన్ల దాడి కారణంగా రాజధానిలోని దెస్నియాన్స్కీ జిల్లాలోని రెండు…